Monday, April 29, 2024

చైన్నైలో లిక్కర్ ఏటీఎంలు.. మందుబాబుల‌కి పండ‌గే

ఏటీఎంల తీరే మారిపోతోంది. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌దు తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే ఏటీఎంలు..ఇప్పుడు బంగారం..బిర్యానీ ఏటీఎంలు వ‌చ్చేసాయ్..కాగా ఇప్పుడు ఏకంగా అల్కాహాల్ కూడా ఏటీఎంలో తీసుకోవ‌చ్చ‌ట‌. చెన్నైలో మందుబాబులు ఏటీఎంల ముందు క్యూ కట్టే రోజులు వచ్చేశాయి. మందుబాబులకు ఏటీఎంలతో పనేంటి, వైన్ షాపులలో ఏటీఎం కార్డుతో కూడా మందు కొనుగోలు చేయొచ్చు కదా అనుకుంటున్నారా .. చైన్నైలో కొత్త ఏటీఎంలు వచ్చేశాయి. ఇందులో మనీ కాదు మద్యం తీసుకోవచ్చు. ఇరవై నాలుగు గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మెషిన్లను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి కోయంబేడుతో పాటు మరో మూడు చోట్ల ఈ మెషిన్లను అధికారులు ప్రారంభించారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మెషిన్ల నుంచి ఎనీ టైం మందు కొనుగోలు చేయొచ్చు.

ఏటీఎంలానే పనిచేసే ఈ మెషిన్లలో ముందుగా పైన కనిపించే బ్రాండ్లలో కావాల్సిన బ్రాండ్ ను ఎంచుకోవాలి. వెంటనే దాని ధరను మెషిన్ చూపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ (ఆన్ లైన్ లో) రూపంలో చెల్లిస్తే.. మెషిన్ కింది బాగంలో నుంచి సీసా బయటకు వస్తుంది. ఈ మెషిన్లు అందుబాటులోకి రావడంతో ఇక మద్యం షాపులు మూసేస్తారని కానీ ఉదయాన్నే వైన్స్ తెరవరని కానీ టెన్షన్ పడాల్సిన అవసరం మందుబాబులకు ఉండదు. ఎనీ టైం మద్యం మెషిన్ల ఏర్పాటుపై బీజేపీ నేత ఖుష్బూ సుందర్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే సర్కారు తీసుకొచ్చిన ఎనీ టైం మద్యం మెషిన్ల ఐడియా సూపర్ గా ఉందంటూ సెటైర్ వేశారు. మద్యం అమ్మకాలను తగ్గించాల్సిన ప్రభుత్వం.. ఆదాయం కోసం ఇలా ఇరవై నాలుగు గంట‌లు లిక్కర్ అమ్ముకునే ఏర్పాట్లు చేయడాన్ని ఖుష్బూ తప్పుబట్టారు.మ‌రి ఈ మ‌ద్యం ఏటీఎంలు ఏ మేర‌కు ప‌ని చేస్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement