Saturday, May 18, 2024

మిమిక్రీ అసోసియేష‌న్ కి న‌టుడు సురేష్ గోపి రూ.2ల‌క్ష‌ల విరాళం

కళాకారులకు చేయూతనిస్తూ, మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు నటుడు సురేష్ 2 లక్షల రూపాయల విరాళం అందించారు.మిమిక్రీ కళాకారులను ప్రోత్సహించాలనే తన నిబద్ధతను నిలుపుకుంటూ, మలయాళ నటుడు .. రాజకీయ నాయకుడు సురేష్ గోపి మిమిక్రీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కి రూ. 2 లక్షల చెక్కును అందజేశాన‌ని ప్ర‌క‌టించారు. మహమ్మారి కారణంగా మిమిక్రీ కళాకారులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి విన్న తర్వాత ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కాగా సురేశ్ గోపీ సోమవారం ట్వీట్ చేస్తూ.. ‘‘నా రాబోయే చిత్రం ‘ఒట్టకోంబన్‌’ కోసం అడ్వాన్స్‌గా చెల్లించాను. నేను వాగ్దానం చేసినట్లుగా ఈ రోజు మిమిక్రీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కి ఈ రూ. 2 లక్షలు అందజేశాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement