Sunday, May 19, 2024

Breaking: కంటైనర్​ నిండా హెరాయిన్ సంచులు​.. గుజరాత్​లో పట్టుబడ్డ 1,439కోట్ల మాల్​!

గుజరాత్​లోని కాండ్లా ఓడరేవు సమీపంలో ఒక కంటైనర్​ నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు సమీపంలో ఒక కంటైనర్ నుండి ₹ 1,439 కోట్ల విలువైన 205.6 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్​ ఆపరేషన్ చేపట్టిన తర్వాత పంజాబ్ నుండి దిగుమతి చేసుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు DRI టీమ్​ సోమవారం తెలిపింది. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఇరాన్ నుండి కాండ్లా ఓడరేవుకు వచ్చిన 17 కంటైనర్లలో ఒకదాని నుండి హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్ 21 న, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, డీఆర్ఐ ఎటీఎస్‌తో సంయుక్త ఆపరేషన్‌లో రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని కాండ్లా పోర్ట్ సమీపంలోని కంటైనర్ స్టేషన్‌లో దాడి చేసి ₹ 1,300 కోట్ల విలువైన 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..

కాగా, సోమవారం DRI టీమ్​ గుజరాత్ ATS అధికారులతో సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రస్తుతం ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సంస్థ కాండ్లా పోర్ట్ లో దిగుమతి చేసుకున్న సరుకును పరిశీలిస్తున్నారు. ఈ సరుకు ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి కాండ్లా ఓడరేవుకు చేరుకుంది. 10,318 బ్యాగులతో 17 కంటైనర్లలో దిగుమతి చేసుకున్న ఈ సరుకు 394 మెట్రిక్ టన్నుల బరువు ఉందని, దీన్ని “జిప్సమ్ పౌడర్”గా పేర్కొన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అక్రమ మార్కెట్‌లో ₹ 1,439 కోట్ల విలువైన 205.6 కిలోల హెరాయిన్ రికవరీ చేసినట్టు తెలిపారు. పోర్ట్ లో సరుకు యొక్క వివరణాత్మక పరిశీలన ఇంకా కొనసాగుతోంది  అని DRI తెలిపింది.

అయితే ఉత్తరాఖండ్‌లోని చిరునామాతో దిగుమతిదారుడు తప్పుడు అడ్రెస్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. దిగుమతిదారుని పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా మాన్‌హంట్ నిర్వహిస్తున్నారు. అని DRI వెల్లడించింది.  DRI భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలలో సోదాలు నిర్వహించి.. దిగుమతిదారుని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని నిబంధనల ప్రకారం పంజాబ్‌లోని ఒక చిన్న గ్రామం నుండి చివరికి అతన్ని అరెస్టు చేశారు.

కాగా, దిగుమతిదారు ప్రతిఘటించి పారిపోయేందుకు ప్రయత్నించాడని, అయితే అతన్ని డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారని అధికారులు తెలిపారు. DRI ఆదివారం అమృత్‌సర్‌లోని ప్రత్యేక కోర్టు నుండి అతని ట్రాన్సిట్ రిమాండ్‌ను పొందింది. అతన్ని సోమవారం కచ్‌లోని భుజ్ పట్టణంలోని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామంపై గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భాటియా మాట్లాడుతూ.. 17 కంటైనర్లు గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఇరాన్ నుండి కాండ్లా ఓడరేవుకు వచ్చాయన్నారు. అప్పటి నుండి తమ స్కానర్‌లో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో కూడా కంటైనర్లను పరిశీలించినప్పటికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదన్నారు. తరువాత ఒక కంటైనర్లో నిషిద్ధ వస్తువులు ఉన్నాయని ATS నిర్దిష్ట ఇన్పుట్ ఆధారంగా DRI, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో 205.6 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement