Friday, May 17, 2024

మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌లో యంగ్ త‌రంగ్…

రాజకీయ రంగం వైపు యువత పరుగు
ప్రస్తుత ఎన్నికల్లో పెరిగిన ప్రాధాన్యత
గత ఎన్నికలతో పోలిస్తే 25%పైగా యువత పోటీ
2013 ఎన్నికల్లో కేవలం 10శాతానికే పరిమితం
ఇప్పటి ఎన్నికల్లో 35శాతం పైగా యువత పోటీ
వారిలో 25శాతం రాజకీయాలకు పూర్తిగా కొత్తే
యువ అభ్యర్థులతో పోటీగా ప్రచారం చేయలేకపోతున్న సీనియర్లు

అమరావతి, రాజకీయ తెరపై సర్వసాధారణంగా తలపండిన సీనియర్‌ నేతలే కనిపిస్తుంటారు. ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం మంది సుదీర్ఘకాలం పాటు రాజకీయ రంగంలో అనుభవం ఉన్న నేతలే పోటీలో కనిపిస్తుంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జ రిగిన, జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో యువతీ యువకులు అత్యధిక శాతం పోటీ చేస్తూ కొత్తతరం రాజకీయానికి తెరలేపారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరగబోతు న్న మున్సిపల్‌ ఎన్నికల్లో 35 శాతం పైగా యువత బరిలోకి దిగడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా యువకులు రాజకీయ రంగం వైపు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్ట ంగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పలువురు యువకులు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే ఆయా ప్రాంతాల్లో మారిన రిజర్వేషన్లు స్థానికంగా నెలకొని ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థి తుల నేపథ్యంలో వారసులు రంగ ప్రవేశం చేశారు. ఫలితంగా యువకులకు మునుపెన్నడూ లేనివిధంగా ప్రస్తుత ఎన్నికల్లో ప్రాధాన్యత పెరిగినట్లయింది. ఈ నెల 10వ తేది రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్ని కలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించి 14718 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 35 శాతం మందికి పైగా యువత పోటీ చేస్తున్నారు. అంటే సుమారు గా 4700 మందికి పైగా యువతీ యువకులు బరిలో ఉన్నారు. వారిలో 22 నుంచి 25 ఏళ్ల లోపు ఉండే యువత 12 శాతం పైగా ఉన్నారు. అలాగే తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి సంఖ్య కూడా 25కు పైగా ఉందంటే ప్రస్తుత పురపోరులో యువత ప్రాధాన్యత ఏ మేరకు పెరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చేందుకు యువత కూడా పోటీ పడుతోంది. ఆ దిశగా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అందులో భాగంగానే పంచా యతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని యువత చక్కగా ఉపయోగించుకుంటోంది.
యంగ్‌.. అభ్యర్థులు
గతంలో ఎన్నికల ప్రచారానికే యువతను ఉపయోగిం చుకునేవారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ ఎన్నికలు జరి గినా పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక అత్యధిక శాతం మంది యువతే ఉండేవారు. వారిలో విద్యార్థులు కూడా అధిక సంఖ్యలోనే కనిపించేవారు. రాజకీయ నాయకుల వెన్నంటే యువత ఉండేవారు. నాయకులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా యువతే పరుగులు తీసేవారు. అందరికంటే ముందు ఆయా కార్యక్రమాలను తమ భుజాలపై వేసుకుని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ముందుండేవారు. అయితే రోజులు మారిపోతున్నాయి. కాలాలు గడిచిపోతున్నాయి.. ఎన్నికల ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యం లోనే యువత ఒకరి వెనుక ఉండి జై కొట్టడం కంటే మనమే ముందుండి యువతకు ఆదర్శంగా నిలవాలని ఎందరో యువనాయకులు రాజకీయ అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో యువతకు ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా ఆయా ప్రాంతాల్లో మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో రాజకీయ వారసులుగా యువత రంగ ప్రవేశం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు ప్రస్తుత పురపోరులో ఎక్కడ చూసినా యంగ్‌ అభ్యర్థులే దర్శనమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం లోను యువత దూసుకుపోతున్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే.. 25 శాతం పైగా యువత పోటీ
రాష్ట్రంలో 2013లో జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో యువత ప్రాధాన్యత అంచనాలకు మించి పెరిగింది. గత ఎన్నికల్లో కేవలం 10 శాతం లోపే పోటీ చేసిన యువకులు ప్రస్తుత ఎన్నికల్లో 35 శాతం వరకు పోటీ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే 25 శాతంకు పైగా పెరిగినట్లు స్పష్ట ంగా కనిపిస్తోంది. గతంలో తల్లిదండ్రుల విజయంలో కీలకపాత్ర పోషించడం, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి తమ బంధువర్గంతో పాటు తల్లిదండ్రులను గెలిపించుకునేందుకు శక్తిమేరకు యువత కృషిచేసేవారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ల ను కల్పించడం, అలాగే 50 శాతం మహిళలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్‌న ప్రాంతాల్లో సీనియర్‌ నేతల సీట్లు గల్లంతయ్యాయి. వారు పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో తమ వారసులుగా కూతుర్లను రంగంలోకి దించారు. అలాగే మరికొన్ని ప్రాంతాలలో అయితే అల్లుళ్లను పోటీలోకి దించారు. మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో అయితే ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లుగా మారడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యనాయకుల వెన్నంటే ఉండే వారికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించే నేపథ్యంలో యువతకు అవకాశం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యువతకు ప్రస్తుత ఎన్నికల్లో మరింత ప్రాధాన్యత పెరిగినట్లయింది.
యంగ్‌ స్టార్స్‌తో పోటీగా ప్రచారం చేయలేకపోతున్న సీనియర్లు
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పురపోరులో 22 నుంచి 30 సంవత్సరాల లోపు పోటీ చేస్తున్న యువతీ యువకులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా గడిచిన నాలుగు రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే సందర్భంలో ఆయా ప్రాంతాల్లో పోటీలో ఉన్న తలపండిన సీనియర్‌ నేతలు యువతతో పోటీగా ప్రచారం చేయలేక వెనుకబడిపోతున్నారు. దశాబ్దాల తరబడి రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసుకుని ఒంటిచేత్తో ఎన్నో వార్డులను సొంతం చేసుకున్న ప్రథమ శ్రేణి నాయకులు సైతం యంగ్‌ స్టార్స్‌ ప్రచారంతో పోటీ పడలేక ఢీలా పడిపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువతంతా సీఎం జగన్‌నే ఆదర్శంగా తీసుకుని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగామని స్పష్ట ం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement