Friday, May 17, 2024

పెళ్లికి ప‌త్రం స‌క్సెస్…

హైదరాబాద్‌, : బాల్య వివాహాల కట్టడి, పెళ్లిళ్లకు చట్టబద్దత అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పెళ్లిd ఇప్పుడు రిజిస్టరై రికార్డు ల్లోకి చేరుతోంది. అక్షరాస్యతలో ఎగువ స్థానంలో ఉన్న కేరళ కూడా ఈ విషయంలో దిగదుడుపే అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న సంస్కరణలతో దీర్ఘకాలిక ఫలాలు, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందనేందుకు వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం తార్కాణంగా నిలు స్తోంది. బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటంతో పాటు, సర్కారీ పథకాలు, కళ్యాణలక్ష్మి వంటి పథ కాలకు వివాహ రిజిస్ట్రేషన్లు ఇతోధికంగా సాయ పడుతున్నాయి. రోజుల తరబడి వేచిచూడ కుండా ప్రభుత్వం తక్షణమే వివాహ రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. గతంలో విదేశాలకు వెళ్లేవారు మాత్ర మే చేయించుకునే వివాహ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ప్రతి వివాహానికి
పక్కా అయ్యాయి. దీంతో బాల్య వివా హాలకు చెక్‌ పడింది. నూతన పంచాయతీరాజ్‌, ముని సిపల్‌ చట్టాల అమలుతో పకడ్బందీ మార్గ దర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. వివాహా లను రిజిస్ట్రేషన్‌ చేసే బాధ్యతలను గ్రామాల్లో గ్రామ కార్యదర్శులకు ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో ప్రతి వివాహం రిజిస్ట్రేషన్‌ కావాలని, రికార్డుల్లో నమోదు కావాల్సిందేనన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది.
2002లోనే ఉమ్మడి రాష్ట్రంలో వివాహ రిజిస్ట్రేషన్లకు చట్టం తెచ్చారు. వివాహ నమోదు చట్టంతో 2006 నుంచి సెక్షన్‌ 6 ప్రకారం ప్రతి వివాహాన్ని నమోదు చేయాలని నిర్దేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, నగర పంచాయతీలు, పురపాలికల్లో కమిషనర్లు, గ్రామస్థాయిలో పంచా యతీ కార్యదర్శులు వివాహ రిజిస్ట్రేషన్లు చేయా లని చట్టంలో పొందుపర్చారు. జిల్లా సంక్షే మా ధికారి అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరి స్తారు. అప్పట్లో చట్టం తెచ్చినా పూరి ్తస్థాయిలో ప్రచారం, అవగాహన లేకపోవడంతో విజయవంతం కాలేదు. లక్షలాది వివాహాలు జరుగు తున్నా వందల్లో కూడా వివాహాల రిజిస్ట్రేషన్లు జరగలేదు. అప్పటి ప్రభుత్వాలు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేకపో యాయి. ఫలితంగా ఈ చట్టం కాగితాలకే పరిమి తమైంది. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పుడు ప్రతి పెళ్లిd చట్ట బద్దంగా రిజిస్టర్‌ అవుతు న్నది. బాల్య వివాహాలు నిలిచిపోయాయి. చిన్నత నంలో జరిగే పెళ్లిళ్లతో అనారోగ్యాలు, అవస్థలు తగ్గిపోయాయి. లక్షల్లో జరుగుతున్న పెళ్లిళ్లు అంతే స్థాయిలో పట్నం నుంచి పల్లెల దాకా ప్రభుత్వం కల్పించిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో రికార్డుల కెక్కుతున్నాయి.
వివాహ రిజిస్ట్రేషన్లకు మూడు విధానాలు అనుసరిస్తున్నారు. నూతన విధానంలో భాగంగా వధూవరులకు వివాహ మెమోరాండం అందించి పూర్తి వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తారు. ఇందుకు ఆధార్‌ కార్డు, వివాహ శుభలేఖ, పెండ్లి ఫొటోలు, ముగ్గురు సాక్షులు, వారి సంతకాలు తీసుకుని వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం అందిస్తారు. వివాహ సమయంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షణ చేస్తారు. పట్టణాల్లో మునిసిపల్‌ కార్యాలయాల్లో రిజిస్రే ్టషన్లు చేసి ధ్రువీకరణ ఇస్తుండగా, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కూడా మ్యారేజీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో లక్షలాది జంటలు తమ వివాహాలను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లలకు సాయంగా అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు ఇప్పుడు ప్రజలు క్యూ కడుతున్నారు. ఒక్కో వివాహానికి ప్రభుత్వం తరపున రూ. 1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్య ంలో చట్టబద్దంగా వివాహాలు జరుగుతున్నాయి. దీనిని పొందేందుకు ప్రథమ అర్హతగా మ్యారేజీ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కావడంతో ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టరై ధ్రువీకరణ పత్రం పొందుతోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఆశించిన బాల్య వివాహాల నిరోధం సమర్ధవం తంగా అమలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement