Saturday, April 27, 2024

Viral Video: కేటీఆర్​ సూపర్​ స్పీచ్.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో!​​

అది ఒక సభ… అంతా స్టూడెంట్స్​, యువత, విద్యాధికులు ఉన్నారు. ఆ సభలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్​) ప్రసంగిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు, ప్రసంగం వింటూ యావత్​ సభికులు అలా చూస్తుండిపోయారు. పిన్​ డ్రాప్​ సైలెంట్​ అయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అందరిలో ఉత్తేజపరిచేవిగా ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్​ అవుతోంది. ఆ వివరాలు, వీడియో మీకోసం..

‘‘ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలయ్యే శక్తి ఉంది.. వాటిని నడిపే సత్తా ఉంది.. వరల్డ్​ క్లాస్​ ప్రొడక్ట్స్​ తయారు చేసే సత్తా ఆ బుర్ర మనకు లేదా. బుర్ర ఉంది కానీ మనం వాడడం లేదు. ఏం చేస్తున్నం మనం, వీడిదేం కులం.. వాడిదేం మతం.. ఇదేందీ, అదేందీ పాకిస్తాన్​ కతేంది, ఆఫ్గనిస్తాన్​ కతేంది, చైనా కతేంది.. గాడికే మన లెక్క. ఎన్ని రోజులు పోల్చుకుందాం. పాకిస్తాన్​తోని, బంగ్లాదేశ్​తోని, ఆఫ్గనిస్తాన్​తోని.. పోటీపడద్దా అమెరికాతోని, చైనాతోని, యూరప్​తోని..

ఒక చిన్న కథ చెబుతా మీకు.. 1987లో ఇండియా, చైనా రెండూ సేమ్​ సిమిలార్​ సైజ్​ కంట్రీస్​.. అప్పట్లో రెండింటి జీడీపీ దాదాపు సమానమే. 35 ఏండ్ల తర్వాత చూసుకుంటే 3 ట్రిలియిన్​ డాలర్స్​.. చైనా జీడీపీ 16 ట్రిలియన్​ డాలర్స్​.. ప్రపంచంలోనే రెండోది..

మనం ఇన్నేండ్లు ఏం చేస్తున్నమయ్యా అంటే.. వాట్సాప్​లో వచ్చేటియి షేర్​ చేసుకుంట, చిల్లర పంచాయితీలు పెట్టుకుంట కూర్చున్నం. కానీ, చైనా వాడు ఏం చేసిండయ్యా అంటే.. ఫ్యూచర్​ ఎట్లుండాలే అనేదాని గురించి ఆలోచించిండు. అమెరికాతో పోటీపడ్డడు. దానికి తగ్గట్టు సాధించాడు.. యువతను కోరేది ఒక్కటే.. పిచ్చి పంచాయితీలు, పిచ్చి పనులు పెట్టుకోకుండా గూగుల్​, ఫేస్​బుక్​ వంటి కొత్త ఆలోచనలు చేయాలే. మంచి ఆవిష్కరణలు చేయాలి.. ప్రపంచానికి భారత్​ నుంచి మంచి ప్రొడక్ట్​ చేసి ఇవ్వండి. లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’’..

- Advertisement -

ఈ వీడియో www.prabhanews.com లో ఉంటుంది గమనించగలరు..

Advertisement

తాజా వార్తలు

Advertisement