Wednesday, April 24, 2024

12 నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌, జూన్ రెండో వారంలో రిజల్ట్!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ నెల 12 నుంచి ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ (పేపర్లు దిద్దడం) ప్రక్రియ ప్రారంభం కానుంది. 12న ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం సంస్కృతం పేపర్లు దిద్దనున్నారు. ఈనెల 22న ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, మ్యాథ్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్లు దిద్దనున్నారు. 26న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పేపర్లు, 28న కెమిస్ట్రీ, కామర్స్‌, 31న హిస్టరీ, బాటనీ, జూవాలజీ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పేపర్లు దిద్దనున్నారు. ఇక జూన్‌ రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఈ స్పాట్‌ వ్యాల్యూయేషన్‌లో చీఫ్‌ ఎక్జామినర్లు, అసిస్టెంట్‌ ఎక్జా మినర్లు, సబ్జెక్ట్‌ ఎక్సపర్టులు, అధ్యాపకులు ఇతర అధికారులు పాల్గొన నున్నారు. మొత్తం 14 సెంటర్లలో ఇంటర్‌ పేపర్లను దిద్దనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. పరీక్ష ఫలితాలను పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ప్రకటిస్తామని ఇంటర్‌ విద్యా కమిషనర్‌ ఉమర్‌ జలీల్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 24న ఇంటర్‌ పరీక్షలు ముగియనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement