Monday, April 29, 2024

కృష్ణ వ్రింద విహారి చిత్రం – ఫ‌స్ట్ సింగిల్ ఎప్పుడంటే

ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోన్న చిత్రం కృష్ణ‌వ్రింద విహారి. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రంతో షిర్లే సెటియా హీరోయిన్ గా వెండితెర‌కి ప‌రిచ‌యం కానుంది. నాగశౌర్య సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనీష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన ‘వర్షంలో వెన్నెల్లా’ అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేయ‌నున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. ఇందులో రాధిక ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement