Thursday, October 10, 2024

Tollywood drug case: తెలంగాణ సీఎస్ కు హైకోర్టు నోటీసులు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సీఎస్‌ సోమేశ్ కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 25కు హైకోర్టు వాయిదా వేసింది. కాగా.. నిందితుల కాల్‌ డేటా, డిజిటల్‌ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీనిలో భాగంగా  సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement