Thursday, May 2, 2024

కొండా మూవీ ట్రైల‌ర్ – సురేఖ‌ని ఎలా ల‌వ్ చేశారో చూపించారు

తెలంగాణ రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన కొండా దంప‌తుల నేప‌థ్యం ఆధారంగా కొండా మూవీని తెర‌కెక్కిస్తున్నాడు వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 1980 లో లవ్‌ స్టోరీ విత్‌ నక్సల్స్‌ బ్యాగ్రౌండ్‌ తో కొండా మూవీ తెరకెక్కుతోంది. వర్మ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ లో కొండా మురళి పాత్రను చాలా హైలెట్ చేసి చూపించారు. తాజాగా కొండా సినిమా నుంచి మరో అదిరిపోయే అప్టేట్ వదిలింది చిత్ర బృందం. ఈ కొండా సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ లో 1980 లో జరిగిన సంఘటనలు కళ్ల‌కు కట్టినట్టుగా ఈ ట్రైలర్ లో చూపించారు రామ్ గోపాల్ వర్మ. కొండా మురళి విద్యార్థి నుంచి రాజకీయ నాయకుడు ఎలా ఎదిగాడు.. అసలు కొండా సురేఖను ఎలా లవ్‌ చేశాడు అనే దానికి ట్రైలర్‌ లో చూపించారు వర్మ. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్.. చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement