Friday, April 19, 2024

కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ..ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా?

వచ్చే నెలలో జరుగనున్న 5 రాష్ట్రాల‌ ఎన్నిక‌లు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా దేశంలో అతిపెద్ద రాష్ట్ర‌మైన‌ ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, టికెట్లు దక్కిన రాజకీయ నేతలు పార్టీలు మార్పు కొనసాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అగ్ర నాయ‌కురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో రాణి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ‘ద‌లడకీ హూన్ లడ్ శక్తి హూన్’ ప్రచారంలోనూ రాణి ఛటర్జీ భాగస్వాములయ్యారు. ఈ మేర‌కు రాణీ ఛ‌ట‌ర్జీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ప్రియాంక గాంధీ ముంబై కాంగ్రెస్ యువ నాయకుడు సూరజ్ సింగ్ ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అయితే, ఆమె ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? లేదా అన్న‌ది క్లారిటీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement