Saturday, May 4, 2024

OTTలోకి ‘ఖిలాడి’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఖిలాడి’ మూవీ ఓటీటీలో విడుదల కానుంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మార్చి 11 నుంచి ‘ఖిలాడి’ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మూవీలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించగా.. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement