Tuesday, May 7, 2024

ఖబర్దార్ రేణుకా చౌదరి.. గర్జించిన టిఆర్ఎస్ మహిళా నేతలు

మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరిపై ఖమ్మం టిఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు విరుచుకుపడ్డారు. ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన, ఆయన సతీమణి వసంతలక్ష్మి పైన రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి పువ్వాడపై మాట్లాడే కనీస అర్హత రేణుకా చౌదరికి లేదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య సంఘటనలో మంత్రి పువ్వాడ ప్రమేయం ఏ మాత్రం లేకున్నప్పటికీ రేణుకాచౌదరి హైదరాబాదులో ఇద్దరు రౌడీలను వెంటేసుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెన్నై రౌడీని విజయవాడ రౌడీని వెంటబెట్టుకుని మాట్లాడుతున్న రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కిలో బంగారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు అందజేస్తే.. పాప ప్రక్షాళన కోసం చేశారంటూ రేణుకాచౌదరి మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. రేణుకా చౌదరి ఇదే రీతిలో మాట్లాడితే తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం ఖమ్మం నగరం, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక రేణుకా చౌదరి కుట్రతో మంత్రిని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎప్పుడో ఒకసారి జిల్లాకు చుట్టపుచూపుగా వచ్చి పోతూ ఆడబిడ్డను మాయ బిడ్డను అంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న రేణుకా చౌదరికి జిల్లాలో భవిష్యత్తులో అడుగుపెట్టే అవకాశం ఇవ్వమని హెచ్చరించారు. అనంతరం రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇల్లందు క్రాస్ రోడ్డు లో రేణుకా చౌదరి దిష్టిబొమ్మను మహిళా ప్రజాప్రతినిధులు దగ్ధం చేశారు. రేణుకాచౌదరి సూర్పణకగా, ముక్కు చెవులు కోస్తా మంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ పాతిమా జోహారా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, మహిళా అధ్యక్షురాలు కొల్లు పద్మ , బానోతు ప్రమీల, ఖమ్మం నగరంలోని మహిళా కార్పొరేటర్లు అంతా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement