Monday, May 6, 2024

Himachal: అసెంబ్లీ గోడలపై ఖలిస్థాన్ జెండాలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన ద్వారం, గోడలపై ఖలిస్థాన్ జెండాలు దర్శనమిచ్చాయి. ఆదివారం ఉదయం పోలీసులు వాటిని తొలగించారు. శనివారం అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున దుండగులు ఈ పని చేసుంటారని కాంగ్రా ఎస్పీ ఖుషల్ శర్మ చెప్పారు. ఇందులో పంజాబ్‌కు చెందిన టూరిస్టుల హస్తం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement