Wednesday, May 15, 2024

Breaking: రాజకీయాలపై చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు

చిన్న జీయ‌ర్ స్వామి మీడియా ముందుకు వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. మోకాలికి బోడుగుండుకు ముడిపెట్టవద్దన్నారు. తనపేరుపై బ్యాంక్ అకౌంట్ కూడా లేదన్నారు. కొంత మంది దేవతలను చిన్నచూపు చూశామనడం నిజం కాదన్నారు. పూర్వాపరాలు చూడకుండా మధ్యలో కొన్ని అంశాలను పికప్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆదివాసీ జనాలను మేం ఎప్పుడూ చిన్నచూపు చూడలేదన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద అన్న మాటలను ఇప్పుడు వివాదం చేస్తున్నారన్నారు. ఈ మధ్యకాలంలో అలాంటివి చెప్పలేదన్నారు. అది సబబా కాదా అనేది వినేవాళ్లకే వదిలేస్తున్నామన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement