Friday, May 3, 2024

పాత ఫార్మూలాని ఫాలో అవుతోన్న కేజ్రీవాల్..గుజరాత్ కి సీఎం ఎవరో వాట్సాప్ చేయండి

గుజరాత్ కి కాబోయే సీఎం ఎవరు ఉండాలి..దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండని కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అంతేకాదు 6357000360 నంబర్ కు వాయిస్ మెస్సేజ్, వాట్సాప్, ఎస్ఎంఎస్ లను నవంబర్ 3వ తేదీకల్లా పంపించాలన్నారు. అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ మెయిల్ ఐడీని కూడా ప్రకటిస్తామన్నారు. ఫలితాలను 4న వెల్లడిస్తామని చెప్పారు. పనిలో పనిగా అధికార బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. తదుపరి ఐదేళ్ల విషయంలో బీజేపీ వద్ద ప్రణాళిక ఏదీ లేదన్నారు. ఏడాది క్రితం వారు ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీని తొలగించి భూప్రేంద పటేల్ ను నియమించారు. ఆ సందర్భంలో ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. కానీ, మేం అలా చేయం. ఆప్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement