Sunday, April 28, 2024

మూతపడిన కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలు.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే..

ఉత్తరాదిన విప‌రీతంగా మంచు కురుస్తోంది. చ‌ల్ల‌టి గాలులు వీస్తున్నాయి. కాగా, హిమగిరుల్లో వెలసిన కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మరోసారి మూతపడ్డాయి. తిరిగి అవి ఎప్పుడు తెర్చుకుంటాయంటే..

హిమాలయాల్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు కేదార్‌నాథ్ (Kedarnath), యమునోత్రి (Yamunotri) ఆలయాలపై మంచు ప్రభావం పడింది. ఉత్తరాదిన శీతాకాలపు గాలులు ప్రారంభం కావడంతోపాటు మంచు కారణంగా యేటా బద్రీనాధ్, గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు మూతపడుతుంటాయి.

హిమాలయాల్లో భారీగా మంచుపడే శీతాకాలంలో ఈ ఆలయాల్ని మూసివేయడం యేటా జరుగుతోంది. తిరిగి వేసవి ప్రారంభంలో ఈ ఆలయాలు ఓపెన్ అవుతాయి. హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్ , యమునోత్రి ఆలయాలు (Kedarnath and Yamonotri temples Closed) నవంబర్ 6వ తేదీ నుంచి మూతపడ్డాయి. సంప్రదాయబ‌ద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాల్ని శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయ ద్వారాల్ని మద్యాహ్నం 12 గంటలకు మూసివేశారు.

కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. శీతాకాల బస నిమిత్తం ఈ దేవాలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాల్ని అందంగా అలంకరించిన పల్లికిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంగోత్రి ఆలయం ఇప్పటికే మూతపడగా..ఈ నెల 20వ తేదీన బద్రీనాథ్ ఆలయం (Badrinath Temple) మూతపడనుంది. మంచు తగ్గుముఖం పట్టిన త‌ర్వాతే ఈ ఆలయాలు తెర్చుకోనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement