Wednesday, April 24, 2024

మరో ఆరు నెలలపాటు ఉచిత రేషన్ ఇస్తామ‌న్న కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా వ‌చ్చి పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన‌వర్గాల ప్ర‌జ‌ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చిన్నాబిన్నం చేసింది. అయితే ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ వ‌ర‌కు ఉచిత రేష‌న్ ప‌థ‌కాన్ని కొన‌సాగించింది. అయితే, కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో ముగియనుంది. అయితే, దీనిని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేయడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికి సంబంధించి సీఎం ట్వీట్ చేశారు. మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని ఢిల్లీలో పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్ర‌ధాని మోడీ కూడా ఈ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని ఢిల్లీ సీఎం ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement