Wednesday, May 1, 2024

గుట్కా..జ‌ర్దా..పాన్ మ‌సాలా త‌యారీల‌పై నిషేధం..’పోలీసుల‌’కు ఫుల్ ప‌వ‌ర్స్..

యువ‌త త‌ప్పు దారి ప‌డుతున్నారు. ప‌లువురు యువ‌కులు మ‌త్తులో జోగుతున్నారు. డ్ర‌గ్స్,మ‌ద్యం,గంజాయి ఇలా ప‌లు దుర‌ల‌వాట్ల‌కి బానిస‌ల‌వుతున్నారు. ఒక రాష్ట్ర‌మ‌ని ఏం లేదు దాదాపు అన్ని రాష్ట్రాల ప‌రిస్థితి ఇదే. అయితే వీటి నివార‌ణ‌కు న‌డుం బిగిస్తున్నాయి ప‌లు రాష్ట్రాలు. ఇక ఏపీ కూడా ఇప్ప‌టికే గంజాయిని స‌మూలంగా అంతం చేసేందుకు సిద్ధ‌ప‌డింది. ఇప్ప‌డు యువత బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోన్న గుట్కా, జర్ధా లాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్పటికే వీటి తయారీ, క్రయ విక్రయాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇకపై ఆంక్షలు కాదు.. ఏకంగా నిషేధమే. ఈ మేరకు చట్టం తీసుకురాబోతుంది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలోనే హానికరమైన గుట్కా విక్రయాలను నిషేధిస్తూ బిల్లుని ముసాయిదాని గవర్నమెంట్ సిద్ధం చేసింది. దీని ప్రకారం గుట్కా వ్యవహారాలు నేరుగా పోలీసుశాఖ రేంజ్‌లోకి వెళ్లనున్నాయి. వారికి ఫుల్ పవర్స్ రానున్నాయి. కేసు నమోదు చేస్తే నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు లక్షకు తగ్గకుండా 5 లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో గుట్కా, జర్ధా, పాన్‌మసాలా, తయారు చేసినా…విక్రయించినా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఎస్సై(S.I.)స్థాయి అధికారికి సైతం గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకునే పవర్స్ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement