Thursday, April 25, 2024

‘జ‌న‌సేన’ అభ్య‌ర్థిగా ‘రియాజ్’..వైసీపీని త‌ట్టుకుంటాడా..

నెల్లూరు జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 30వ డివిజ‌న్ జ‌న‌సేన అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశాడు రియాజ్. ఎవ‌రీ రియాజ్ అనుకుంటున్నారా.. అదిరింది, గల్లిబాయ్స్.. షోల‌లో సంద‌డి చేశాడీయ‌న‌. మొదటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన రియాజ్ పవన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీలో ఉన్నాడు. బుల్లితెర మీద మంచి పేరు సంపాదించిన రియాజ్ అనూహ్యంగా నెల్లూరులో పోటీకి సిద్దమయ్యాడు. ఒక్క అవకాశమిస్తే అభివృద్ది చేసి చూపిస్తా అంటున్నాడు. పొలిటికల్ అవేర్ నెస్ ఎక్కువగా ఉండే నెల్లూరులో మరి రియాజ్ గెలుస్తాడా అనేది చూడాలి. మ‌రి ఏపీ అధికార పార్టీ వైసీపీని త‌ట్టుకోగ‌ల‌డా అనేది కూడా తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement