Thursday, May 23, 2024

CM KCR : గ‌ద్వాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

జోగులాంబ గ‌ద్వాల : ముఖ్య‌మంత్రి కేసీఆర్ జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం పండితుల వేద మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించి, రిబ్బ‌న్ క‌ట్ చేసి పార్టీ కార్యాల‌యాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా గ‌ద్వాల్ జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, అంబ్ర‌హం, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, అంజయ్య యాద‌వ్, శాట్స్ చైర్మ‌న్ ఆంజ‌నేయులు గౌడ్‌తో పాటు ప‌లువురు ప్రజా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement