Tuesday, May 7, 2024

జానీ మాస్ట‌ర్ కి – క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ‘సుదీప్’ సర్ప్రైజ్ గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవితో స‌హా ఎంతోమంది స్టార్ హీరోల‌కు డాన్స్ మాస్ట‌ర్ గా ప‌ని చేశారు జానీ మాస్ట‌ర్. కాగా ఇప్పుడు త‌మిళంలో కూడా బిజీగా మారిపోయారు. రీసెంట్ గా బీస్ట్ సినిమా నుంచి వచ్చిన అరబిక్ కుతూ పాట ఎంత రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూసాం. ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. విజయ్ తో పాటుతమిళ్ లో చాలామంది స్టార్ హీరోలకు కూడా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా జానీ మాస్టర్ కు కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒక కార్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు . అయితే ఈ కారు పేరు మహీంద్రా తార్ దీని విలువ సుమారు రూ: 13.17 లక్షలుగా ఉంటుందని అంచనా. అయితే జానీ మాస్టర్ తన లైఫ్ లో సుదీప్ లాంటి మంచి మిత్రులను కలిగి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ లో పెర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement