Friday, May 3, 2024

క‌న్న‌డ స్టార్ య‌శ్ ని – అమితాబ‌చ్చ‌న్ తో పోల్చిన కంగ‌నార‌నౌత్

ఎప్పుడు ఎవ‌రిని ప్ర‌శంసిస్తుందో..ఎవ‌రిపై నిప్పులు క‌క్కుతుందో బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నార‌నౌత్ కే తెలియాలి. అయితే క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించిందీ బ్యూటీ. కంగ‌నార‌నౌత్ కేజీఎఫ్2పై కామెంట్స్ చేశారు..హీరో యష్‌ని లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌తో పోల్చింది. అనేక దశాబ్దాలుగా భారతదేశం మిస్ అయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ యష్… డెబ్బైల నుండి అమితాబ్ బచ్చన్ మిగిల్చిన ఆ శూన్యతను ఆయన భర్తీ చేశారు… అద్భుతం” అంటూ ‘కేజీఎఫ్” స్టార్ పై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇంకేముంది యష్ ని కంగనా బాలీవుడ్ మెగాస్టార్ తో పోల్చడం ఆయన అభిమానులను ఫిదా చేసేసింది. ఇంతకుముందు కూడా కంగనా సౌత్ స్టార్స్, నార్త్ స్టార్స్ మధ్య పోలిక చెబుతూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు య‌శ్ ని పొగ‌డంతో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది కంగ‌నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement