Thursday, May 2, 2024

‘పునీత్’ మ‌ర‌ణించిన‌ట్టు – ఆయ‌న మేన‌త్త‌కి తెలియ‌నివ్వ‌ని ఫ్యామిలీ

చిన్న వ‌య‌సులో హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించాడు క‌న్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్. ఆయన మృతి చెంది నాలుగు నెలలు గడిచిపోయినా ఆ షాక్ ను ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోవైపు పునీత్ మృతి చెందిన విషయాన్ని ఆయన మేనత్త నాగమ్మకు ఇప్పటి వరకు చెప్పలేదట. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు నాగమ్మ సొంత చెల్లెలు. తన మేనల్లుడు పునీత్ అంటే ఆమెకు పంచ ప్రాణాలు. ఆమె వయసు 90 ఏళ్లు. పునీత్ మరణించాడనే వార్తను విని ఆమె తట్టుకోలేదని… ఇంత వరకు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. పునీత్ గురించి ఆమె అడిగినప్పుడల్లా ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడని చెపుతున్నారట. ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement