Sunday, May 5, 2024

బాలీవుడ్ మూవీల‌పై న‌టుడు సుదీప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌న్న‌డ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించార‌ని ఎవరో అంటున్నారని, అయితే, ఇందులో ఒక చిన్న విష‌యాన్ని స‌రిద్దాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు న‌టుడు కిచ్చ సుదీప్. హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదని, బాలీవుడ్‌ ఎన్నో పాన్‌ ఇండియా సినిమాలను నిర్మిస్తోందని చెప్పాడు. సినిమాల‌ను తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఎంతో కష్టపడుతున్నారని అన్నాడు. అయితే, ఆ బాలీవుడ్ సినిమాలు అంతగా విజయం సాధించలేకపోతున్నాయని, మనం తీస్తున్న సినిమాలను మాత్రం ప్రపంచం మొత్తం చూస్తున్నార‌న్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. కాగా, ఈగ, బాహుబలి, సైరా వంటి సినిమాల్లో న‌టించి సుదీప్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా విక్రాంత్ రోణ సినిమాలో న‌టిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement