Tuesday, May 7, 2024

RRR: రాజమౌళికి ఆరు నెలలు జైల్లో పెట్టాలి.. KRK హాట్ కామెంట్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నేడు పంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీపైన భారీ అంచనాలు తారాస్థాయిలో ఉండగా.. అభిమానులకు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.ఇప్పటికే ప్రీమియర్స్, బెన్ ఫిట్ షోలు చూసి అభిమానులు, సెలబ్రిటీలు సినిమా బంపర్ హిట్ అంటున్నారు.

అయితే, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్(KRK) మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, దర్శకుడి రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రం తీసినందుకు దర్శకుడు రాజమౌళికి ఆరు నెలల జైలు శిక్ష విధించాలని కమల్ ఆర్.ఖాన్ పేర్కొన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు తీయనటువంటి చెత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ అని, దీన్ని పొరపాటు అని తాను అనని, ఇదొక పెద్ద నేరమని పేర్కొన్నారు. రూ.600 కోట్ల రూపాయలతో ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని ఆరు నెలల పాటు జైల్లో పెట్టాలని కమల్ ఆర్.ఖాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement