Sunday, April 28, 2024

Jumping Tensions – అన్నిపార్టీల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న జంపింగ్స్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు అంతకంతకూ వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో పరిణామాలు గంట గంటకూ మారిపోతున్నా యి. అధికార బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. బీ-ఫామ్‌లు కూడా ఇచ్చేసి, మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ శంఖా రావం పూరించారు. ఇక అంతకుముందు నుంచే జాతీయ స్థాయి నేతలతో కాంగ్రెస్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, భారీ బహిరంగ సభలు నిర్వహించింది. రెండో విడత బస్సు యాత్రకు ఆ పార్టీ సమాయత్తమైంది. మొదటి జాబితాను రిలీజ్‌ చేసిన హస్తం.. ఒకటి రెండు రోజుల్లో రెండో విడత జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. ఇక బీజేపీ కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో సీనియర్లు, ఆశావహుల పేర్లు లేకపోవడం పలు అను మానాలు, అంతకుమించి ఊహాగానాలకు తెరలేపుతోంది.


అసెంబ్లీ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతల జంపింగ్‌లు అన్ని పార్టీ లను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రాత్రి ఇక్కడున్న నాయకులు తెల్లవారే సరికి అదే పార్టీలో ఉంటారన్న గ్యారెంటీ- లేకుండా పోయిన పరిస్థితి నెలకొని ఉంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఇక్కడి నుంచి మరో చోటు-కి వెళుతుండడం చిరాకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు సిట్టింగ్‌లు, మాజీలు, ముఖ్యనేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు హస్తం వైపు అడుగులేస్తు న్నారు. తాజాగా.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కమలం పార్టీకి బై బై చెప్పేసిన ఆయన.. కాంగ్రెస్‌ గూటికి చేరబోతున్నారు. బీఆర్‌ఎస్‌ అధి నేత, సీఎం కేసీఆర్‌ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ- చేయాలని లేదంటే తానే గజ్వేల్‌లో పోటీ- చేసి ఓడిస్తానని సవాల్‌ విసిరారు. వంద మంది ఎమ్మెల్యే లను తీసుకొచ్చి దుర్మార్గంగా మునుగోడు బైఎలక్షన్‌ లో తనను బీఆర్‌ఎస్‌ ఓడించిందని.. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్నారు.

అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని.. అందుకే కాంగ్రెస్‌లోకి మరలా వచ్చినట్లు- రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. సోదరుడి చేరికపై మీడియాతో మాట్లా డిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సడన్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై కాంగ్రెస్‌ అధిష్టానానిదే నిర్ణయమని, తనతో ఎటు-వంటి చర్చ జరపలేద న్నారు. ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్‌. ఎవరు ఎక్కడి నుంచి పోటీ- చేయాల నేది హైకమాండ్‌ నిర్ణయిస్తుందని, టికెట్లపై హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటు-న్నారని, తన సోదరుడే కాదు.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, కర్ణాటకలో హామీ ఇచ్చిన పథకాలు అమలు చేసినట్లుగా తెలంగాణాలో కూడా అమలు చేసి తీరుతామన్నారు.

భారాస వైపు ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత వివిధ పార్టీల్లో చేరిన ఉద్యమకారులంతా ఒక్కరొక్కరుగా బీఆర్‌ఎస్‌ పంచన చేరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి, చెరుకు సుధాకర్‌ సొంత గూటికి చేరుకోగా తాజాగా బుధవారం పెద్దపల్లికి చెందిన ఉద్యమ కారులు మంత్రి కేటీ- రామారావు సమక్షంలో అధికార పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేప ట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగా లన్నా, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావాలన్నా గులాబీ రెండు జెండాను ఆశీర్వదించాలని కేటీ-ఆర్‌ కోరారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తుండడంతో జంపిం గ్‌లు యథేచ్ఛగా సాగుతుండడం అన్ని పార్టీలను కలవరపెడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement