Saturday, May 4, 2024

2024ఎన్నిక‌ల బ‌రిలో జో బైడెన్.. ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ్.. జిల్ బైడెన్

2024ఎన్నిక‌ల‌బ‌రిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్. ఈ మేరకు ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య‌.. అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ తెలిపారు. ఇందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వయసు పైబడిన (80 ఏళ్లు) కారణంగా వచ్చే ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలుగుతారనే ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో జిల్ బైడెన్ మాట్లాడారు. ఇటీవల నమీబియా, కెన్యాలో జిల్ బైడెన్ పర్యటించారు. అక్కడ అసోసియేటెడ్ ప్రెస్ ప్రతినిధి.. సెకండ్ టర్మ్ కోసం బైడెన్ పోటీ పడతారా అని అడగడంపై జిల్ అసహనం వ్యక్తంచేశారు. మీరు నమ్మాలంటే.. ఆయన ఎన్నిసార్లు చెప్పాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో బైడెన్ పోటీ చేయడంపై డెమోక్రాటిక్ పార్టీ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కిన ఆయనకి.. జనం ఓట్లు వేస్తారా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే బైడెన్ మాత్రం.. తాను రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని గతంలోనే ప్రకటించారు. నేనింకా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రచారం మొదలుపెడతా అని బైడెన్ ఓ సందర్భంలో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement