Sunday, December 8, 2024

హైకోర్టును ఆశ్ర‌యించండి – మ‌నీష్ సిసోడియాకు సుప్రీం సూచ‌న‌

న్యూఢిల్లీ – త‌న‌ను సిబిఐ అరెస్ట్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఢిల్లీ డిప్యూటీ సిఎం మ‌నీష్ సిసోడియా దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది.. ముందుగా దీనిపై హైకోర్టును ఆశ్రయించ‌వ‌ల‌సిందిగా సిసోడియాకి సూచించింది.. దీనిపై తదుపరి విచారణకు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అవినీతి కిందకు వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో సిసోడియా తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం సూచ‌న‌కు అనుగుణంగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement