Thursday, April 25, 2024

PKSDT షూటింగ్ స్టార్ట్..

ఇటీవ‌లే స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ష‌న్ లో ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్‌ల మ‌ల్టీస్టార‌ర్ మూవీ స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకున్న అప్‌డేట్ ప్రకారం సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో మెరవనుందని తెలుస్తోండగా.. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో అసోసియేట్‌ అవుతూ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. PKSDT ప్రాజెక్ట్‌కు వివేక్‌ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన వినోధయ సీతమ్‌ తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. తెలుగు వెర్షన్‌లో ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కొన్ని మార్పులు చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. కాగా డైరెక్టర్ సముద్రఖని లొకేషన్‌లో యాక్షన్‌ అని చెబుతూ.. మానిటర్‌ చేసుకుంటున్న స్టిల్స్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement