Saturday, April 27, 2024

గన్నుకన్నా పెన్ను గొప్పదని నిరూపించిన జర్నలిస్ట్

మావోయిస్టుల చేతిలో బందీగా ఉన్న జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ను విడిపించడంలో ఏడుగురు జర్నలిస్టులు బాధ్యత తీసుకున్నారు. విడుదలైన ఆ జవాన్‌ను బైకుపై బయటికి తీసుకు వచ్చిందీ జర్నలిస్ట్. జర్నలిస్టులను అందరూ గౌరవిస్తారు. కష్టకాలంలో రాజకీయ నాయకులైనా, అధికారులు, వ్యాపారులు, ప్రజలు ఎవ్వరికైనా జర్నలిస్టు, మీడియానే గుర్తుకొస్తుంది. మాకు న్యాయం జరుగుతుందని జనం కూడా జర్నలిస్టులను కలుస్తారు. ఇప్పటికీ సమాజంలో జర్నలిస్టుల పట్ల మంచి అభిప్రాయం ఉంది. కానీ కొందరు మీడియా యాజమాన్యాలు, పాలకులు వీరికి తోడు కొందరు జర్నలిస్టులు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు జర్నలిస్ట్ వ్యవస్థను వాడుకుని కరివేపాకులా పారేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా కించపరుస్తున్నారు. ఇప్పటికీ నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేవాళ్ళున్నారు. నీతి, నిజాయితీతో సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులున్నారు. పాలకులు, పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టులను ఆదుకోవాలి, ఆదరించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement