Saturday, May 4, 2024

National | ఇండియాకు జపాన్‌ ఈవీ ముసాషి

జపాన్‌కు చెందిన ఆటో విడిభాగాల తయారీ సంస్థ ముసాషి తాము ఇండియాలో విద్యుత్‌ వాహన రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. బీఎన్‌సీ మోటార్స్‌తో భాగస్వామ్యంలో మొదటి దశలో 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపింది. ముసాషి సెమిట్సు ఇండస్ట్రీస్‌ ఇందు కోసం ముసాషి ఇండియా సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ టూ వీలర్స్‌కు ఫోర్‌ వీలర్స్‌కు అవసరమైన ట్రాన్స్‌మిషన్‌ కంపొనెంట్స్‌ తయారు చేస్తోంది. అక్టోబర్‌ నుంచి ముసాషి సంస్థ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కంపెనీకి ఉన్న డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ అనుభవంతో విద్యుత్‌ వాహనాలను రూపొందించనుంది. మోటార్‌, సీపీయూ, గేర్‌ బాక్స్‌ వంటి వి తయారు చేయనుంది.

ఇండియాలో భారత్‌ న్యూ ఎనర్జీ కంపెనీ(బీఎన్‌సీ)తో కలిసి విద్యుత్‌ వాహనాల తయారీ, ఉత్పత్తిని చేయనున్నట్లు ముసాషి ఇండియా సీఈఓ తోషిహిసా ఒట్సుకా తెలిపారు. ఇండియాతో పాటు థాయిలాండ్‌లో ఒక కంపెనీతోనూ, వియత్నాంలో ఈవీ గో కంపెనీతో, కెన్యాలో ఏఆర్‌సీ రైడ్‌తో ఈవీ వాహనాల ఉత్పత్తి కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఇండియాలో ఈవీల కోసం ముసాషి కంపెనీ ఈ-యాక్సిల్స్‌ను తయారు చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement