Thursday, May 9, 2024

RRR మరో సర్ప్రైజ్.. ‘జనని’ సాంగ్ రిలీజ్

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ RRR. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానున్న ఈ మూవీకి సంబంధించిన మరో పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడులైన దోస్తి, నాటు నాటు సాంగ్‌లు యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించింది. తాజాగా జ‌న‌ని అనే సాంగ్ విడుద‌ల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటకు ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ‘జనని’ పాటలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ ఎక్స్‌ప్రెష‌న్స్ ఉద్వేగ‌భ‌రితంగా ఉన్నాయి. ఈ పాట ఎమోషన్‌ల్ గా ఉంది.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం బాషాల్లో ఒకేసారి విడుదల కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement