Friday, May 10, 2024

జగన్ బెయిల్ రద్దు.. ఇక జైలుకే!

సీఎం వైఎస్ జగన్ పై బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందని, ఏ క్షణమైనా జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని అన్నారు. అయితే, వైఎస్ జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక, అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని సునీల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement