Monday, April 29, 2024

నోముల భగత్ ను ఇష్టపడకుండా ఉండలేకపోతున్నా…వర్మ గారి దృష్టి పడింది !!

రామ్ గోపాల్ వర్మ… వర్మ గారి పేరు చెప్పగానే కాంట్రావర్శి అని అర్థం అయ్యే ఉంటుంది. అవును మరో సారి వర్మ కాంట్రవర్సీ చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పై ఈసారి వర్మ కామెంట్ చేశారు. తనకి ఆ నియోజకవర్గంలో ఓటు ఉంటే టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఓటు వేసేవాడిని అని చెప్పారు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. తాను భగత్ కి ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నానో చెప్పారు.

ఆ వీడియో లో చిరుత పులి ని తాడుతో కట్టేసి భగత్ కలిసి నడుస్తున్న కనిపిస్తాడు. కేసీఆర్ పులి.. కేటీఆర్ సింహం …అని తెలుసు. కానీ చిరుత పులి ని వాకింగ్ కు తీసుకువెళ్తున్న భగత్ ను ఇష్టపడలేకుండా ఉండలేకపోతున్నాను. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓటు ఉండి ఉంటే ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికల పోలింగ్ లో భగత్ కు ఓటు వేసే వాడిని అంటూ చెప్పుకొచ్చారు వర్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement