Thursday, April 25, 2024

మోసగాడితో జాక్వెలిన్.. సోషల్ మీడియాలో పర్సనల్ పిక్స్ హల్ చల్…

అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటే అందరికీ తెలిసిందే. ఈ మధ్య తను ఓ కేసులో చిక్కుకుంది. మోసగాడు కన్మాన్ సుకేష్ చంద్రశేఖర్ తో తను కలసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై బాలివుడ్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు చేసింది. మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో తనకు సంబంధం ఉందని, రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత మొదటిసారి జాక్వెలిన్ తన పోస్ట్ లో  “న్యాయం, మంచితనం తప్పక గెలుస్తాయి.. అని ఆశిస్తున్నా’’… అంటూ స్పందించింది.

కాగా, 200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ పేరు వచ్చినప్పటి నుండి సుకేష్ , జాక్వెలిన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున సుకేష్ జాక్వెలిన్ ముక్కుపై ముద్దు పెట్టుకున్న మరో ఫొటో లీకైంది. “ఈ దేశ ప్రజలు నాకు విపరీతమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చారు. ఇందులో నా మీడియా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీరి నుండి నేను చాలా నేర్చుకున్నా. నేను ప్రస్తుతం కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నా. కానీ, కచ్చితంగా అనుకుంటున్నా.. నా స్నేహితులు, అభిమానులు నన్ను మంచిదానిగానే చూస్తారు. ఈ నమ్మకంతోనే నా పర్సలన్, సీక్రెట్ ఫొటోలు..  ప్రైవసీకి భంగం కలిగించే ఫొటోలను షేర్  చేయవద్దని మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నా. మీరు మీ సొంత వారికి ఇలా చేయరని కచ్చితంగా భావిస్తున్నా’’ అని ఆ పోస్టులో జాక్వెలిన్ పేర్కొంది.

అంతకుముందు రోజు జాక్వెలిన్, కన్మాన్ సుకేష్‌ల సన్నిహిత ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఫొటోగ్రాఫ్‌లో జాక్వెలిన్ తన బికీని ప్రదర్శిస్తూ ఉంటే.. సుకేష్ ఆమె ముక్కుపై ముద్దు పెడుతున్నాడు. వీరిద్దరి ఫొటోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబర్ లోనూ మరో రెండు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాను నటి జాక్వెలిన్ తో  డేటింగ్ చేస్తున్నానని సుకేష్ చెప్పిన కొన్ని నెలల తర్వాత ఇట్లాంటి ఫొటోలు లీక్ కావడం మొదలయ్యాయి.

200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల ప్రశ్నించింది. సుకేష్ జాక్వెలిన్‌కు హాలీవుడ్ నిర్మాణంలో కూడా ఒక పాత్ర ఇస్తానని హామీ ఇచ్చాడు. సుకేష్ ఆమెకు గూచీ, హెర్మేస్, లూయిస్ విట్టన్, మినీ కూపర్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి అనేక విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా సుకేష్ చాలా మంది ఇతర నటీమణులతో కూడా టచ్‌లో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ నటీమణుల అందాన్ని చూసి సుకేష్ చాలా మంది బాలీవుడ్ నటీమణులకు వివిధ అక్షరాలు.. వారి పేర్లతో బహుమతులు, హాంపర్‌లను పంపుతున్నాడని అతని వ్యవహారాలన్నీ తెలిసిన వ్యక్తి ఒకరు తెలిపారు. జాక్వెలిన్ కంటే ముందు అతను అదే స్టంట్‌ను మరికొంతమందితో ప్రయత్నించాడని తెలిపాడు. కాగా, 200 కోట్ల దోపిడీ కేసులో సుకేష్ చంద్రశేఖర్ గతేడాది అరెస్టయిన విషయం తెలిసిందే.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement