Friday, May 10, 2024

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ ఇంటిపై ఐటీ రెయిడ్స్

ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్ర రామకృష్ణ నివాసంపై ఐటీ శాఖ అధికారులు రెయిడ్స్ చేశారు. ఇప్పటికే ఆదాయపన్ను సెబీ సంస్థల విచారణలో చిత్రా రామకృష్ణ ఉన్నారు. ఆమె ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనికి తోడు అజ్ఞాత యోగితో చిత్ర జరిపిన ఈ-మెయిల్ సంభాషణలు తాజాగా బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబరు వరకు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. మరోవైపు సుబ్రమణియన్‌ నియామక వ్యవహారంపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంచ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా – సెబీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేసినట్టు సెబీ తేల్చింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంచ్‌ వివరాలను అన్నింటినీ సదరు యోగికి ఈ-మెయిళ్ల ద్వారా ఆమె చేరవేసేవారని సెబీ బయటపెట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement