Friday, May 3, 2024

Big Breaking: తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టడమే ల‌క్ష్య‌మా?.. స్వామీజీ, నందు సంభాష‌ణ‌లో ఏముందంటే!

ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను డిస్ట్ర‌ర్బ్ చేస్తున్న బీజేపీ నేత‌లు.. ఎమ్మెల్యేల వీక్‌నెస్‌ని క‌నిపెట్టి వారితో బేర‌సారాలు చేస్తున్న‌ట్టు మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘ‌ట‌న చూస్తే తెలుస్తోంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాలను కూలుస్తూ వస్తున్న బీజేపీ.. తెలంగాణలో కూడా టీఆర్‌ఎస్‌ సర్కారును కూల్చేందుకు కుట్ర పన్నిందని ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఓ మీడియా చాన‌ల్‌తో మాట్లాడుతూ అన్నారు. నెల రోజుల్లో టీఆర్ఎస్‌ సర్కారును కూల్చడమే లక్ష్యంగా బీజేపీ ఏజెంట్‌లు పావులు కదిపార‌ని, తాజాగా లీకవుతున్న ఆడియో టేపులు అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి, బీజేపీ ఏజెంట్ రామచంద్రభారతికి మధ్య సంభాషణలతో మొదటి ఆడియో లీక్‌ కాగా.. ఇప్పుడు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిల సంభాషణలతో రెండో ఆడియో బ‌య‌టికి వ‌చ్చింది. 27 నిమిషాల ఈ రెండో ఆడియోలో ఏముందంటే..

YouTube video

రామచంద్రభారతి: చేరేవాళ్లు తుషార్‌తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా?
నందకుమార్‌: అవును వాళ్లు మాట్లాడ్డానికి సిద్ధంగా ఉన్నారు.

- Advertisement -

రామచంద్రభారతి: రాష్ట్ర బీజేపీకి సంబంధం లేకుండా కేంద్రమే అన్నీ చూసుకుంటుంది. నాకు వాళ్లను వాట్సాప్‌ కాల్‌ కాన్ఫరెన్స్‌లో కలపండి. నాది మరో వాట్సాప్‌ నెంబర్‌ ఇస్తా.. దానికి కాల్ చేయండి. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డికి అంత ప్రాధాన్యం లేదు. గుజరాత్‌ ఎన్నికల ముందు మునుగోడు కోసం ఇంత రిస్క్‌ తీసుకుంటున్నాం. ఒక్కసారి ఎంట్రీ అయితే అమిత్‌ షాయే అన్నీ చూసుకుంటారు.
నందకుమార్‌: చేవెళ్ల, కొడంగల్‌, పరిగి ఎమ్మెల్యేలనూ టచ్ చేశాం.

రామచంద్రభారతి: పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే మన ఆపరేషన్‌ సక్సెస్‌.
నందకుమార్‌: మొదట నలుగురు, ఆ తర్వాత 10 మంది వస్తారు.

రామచంద్రభారతి: మునుగోడు ముందే మన ఆపరేషన్‌ చేస్తే చాలా ప్రభావం ఉంటుంది. బీఎల్‌ సంతోష్‌ అన్నీ చూసుకుంటారు. బీఎల్ సంతోష్‌ను మినిస్టర్‌ కలవాలన్నా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిందే. రోహిత్‌ రాజీనామా చేసిన నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది. ఒకసారి కూర్చున్న తర్వాత మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను టచ్‌ చేద్దాం. 26వ తేదీన నేను హైదరాబాద్‌ వస్తా. బీఎల్‌ సంతోష్‌, తుషార్‌ను కూడా తీసుకొస్తా.

సింహయాజి: నందకుమార్‌ సెక్యూరిటీతోపాటు ఏదైనా పదవి కోరుకుంటున్నాడు.
రామచంద్రభారతి: కేంద్రం సెక్యూరిటీ ఇస్తుంది. పదవి విషయం సంతోష్‌ చూసుకుంటాడు. త్వరలోనే నందూను పార్టీలోకి తీసుకుని నామినేటెడ్‌ పదవి ఇద్దాం. ఒకసారి మనం కూర్చుంటే కేంద్రం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఢిల్లీలో కూడా మన ఆపరేషన్ కొనసాగిస్తున్నాం కదా..! ఆప్‌లోని 43 మంది ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఇక్కడ మునుగోడు ఉప ఎన్నికలకు ముందు చేరినవారికి రూ.100 కోట్లు ఇవ్వడానికైనా బీజేపీ సిద్ధం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వస్తే ఎంత ఇవ్వడానికైనా బీజేపీ రెడీగా ఉంది. పేమెంట్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఇక.. ఇవ్వాల రాత్రికి (శుక్రవారం) మరో డిటెయిల్డ్​ ఆడియో బయటికి రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై సోషల్​ మీడియాలో అప్పుడే పోస్టులు, షేరింగ్​లు మొదలయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement