Sunday, May 5, 2024

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజున వినూత్న ఏర్పాట్లు.. ఢిల్లీలో భారీ ఫ్లెక్సీలతో అభిమాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీఆర్‌ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మెల్సీ కవితకు వినూత్నరీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడో అభిమాని. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలంటూ ఇటీవల వారణాసిలో గంగానదిపై బోట్లపై ఫ్లెక్సీలు పెట్టిన తెలంగాణాకు చెందిన సాయి ఢిల్లీలో కవిత పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలిపాడు. తెలంగాణా భవన్ పరిసరాలు, అశోకా రోడ్‌లో దేశ్‌కా నేత కేసీఆర్, కల్వకుంట్ల కవిత సిస్టర్ ప్రం తెలంగాణా అంటూ పెట్టిన భారీ ప్లెక్సీలు అక్కడి వారందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement