Friday, April 26, 2024

సినిమా కోసం గుర్తుప‌ట్ట‌లేనంత మారి పోయిన కార్తి..

తమిళనాట తనకంటూ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయన నటిస్తున్న సినిమా సర్దార్. ఇందులో తండ్రీ కొడుకులుగా డ్యూయ‌ల్ రోల్ లో నటిస్తున్నాడు కార్తి. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తిగా గుర్తు పట్టకుండా మారిపోయిన కార్తీని చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. గతంలో కూడా కొన్ని సినిమాల కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు కార్తీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. సినిమా కోసం ఈయన పెట్టే ఫోకస్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని కార్తి సర్దార్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement