Sunday, May 5, 2024

మీర్జాపూర్ చూసి రూ.5 కోట్లకు స్కెచ్ వేసిన ఆర్మీ

అతడు ఒక ఆర్మీ జవాను. సెలవులపై ఇంటికి వచ్చాడు. బాలీవుడ్ వెబ్ సిరీస్ చూసి 5 కోట్ల రూపాయలు కొట్టేయడానికి స్కెచ్ వేశాడు. అయితే ప్లాన్ బెడిసికొట్టి చివరికి పోలీసులకు చిక్కాడు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. పార్వతీపురం మండలం చినబంటువానివలసకు చెందిన చందనాపల్లి రాజేశ్వరరావు ఉత్తరప్రదేశ్‌లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్నాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి.. ఆ కథలోని క్రైమ్ ను ఫాలో అయిపోయాడు. డబ్బును సంపాదించేందుకు నకిలీ మావోయిస్టు అవతారమెత్తాడు. మావోయిస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడడమే కాకుండా ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేశాడు.

ఈ నెల 7వ తేదీన పార్వతీపురంలోని పాలకొండు రోడ్డులో ఉన్న బంగారం వ్యాపారి చినగుంపస్వామి అలియాస్‌ బాబు ఇంటివద్దకు రాజేశ్వరరావు వెళ్లి తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి జరిపాడు. మరుచటి రోజు బంగారం వ్యాపారికి ఫోన్ చేసి.. తాను జార్ఖండ్ మావోయిస్టు కమాండర్ దళం సభ్యుడిని అని.. తనకు అర్జెంటుగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరించాడు. దీంతో ఆ బంగారం వ్యాపారి భయపడి పార్వతీపురం పోలీసులను ఆశ్రయించాడు.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ.. ఈ కేసును ఛేధించేందుకు ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేశారు. బంగారు వ్యాపారికి వచ్చిన ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు. మార్చి 17న నిందితుడు ఫోన్ చేసి మరోసారి డబ్బులు డిమాండ్ చేస్తే.. పోలీసులు సూచన ప్రకారం తాను 5 కోట్లు ఇవ్వలేని.. కోటిన్నర వరకు ఇచ్చుకోగలను అని చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రణాళిక ప్రకారం బాబుతో పాటు ఆ నగదు తీసుకుని నిందితుడు చెప్పిన చిరునామాకు వెళ్లారు. అక్కడే ఉన్న రాజేశ్వరరావును గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం ప్లాన్ ను బాలీవుడ్ వెబె సిరీస్ మీర్జాపూర్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement