Saturday, April 27, 2024

భారత్ లో 2 కోట్లు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి​ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల మార్క్​ ను​ దాటింది. సోమవారం ఒక్కరోజే 3.57 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వైరస్ ​కారణంగా మరో 3,449 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,57,229 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల మార్క్​ను చేరింది.  కొవిడ్ నుంచి 3,20,289 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,22,408కి చేరింది. దేశవ్యాప్త రికవరీ రేటు 81.91 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.10 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల 32వేల 921 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారని కేంద్రం ప్రకటించింది.

గత 24 గంటల్లో ఐదు రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 48,621, కర్ణాటకలో 44,438, ఉత్తర ప్రదేశ్ లో 29,052, కేరళలో 26,011, తమిళనాడులో 20,952 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement