Monday, May 17, 2021

‘అఖండ’ ఫస్ట్ సింగిల్ రెడీ!!

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరోవైపు గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కు రెడీ గా ఉందట. దాని విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే తమన్ ఇచ్చిన సౌండింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News