Thursday, May 2, 2024

India: ఫారెన్ టూర్ పోతున్న ప్ర‌ధాని మోడీ.. ఎందుకంటే..

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు ఫారెన్ టూర్ వెళ్ల‌నున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఇటలీ, రోమ్, యూకే, గ్లాస్గోకు ప్రధాని వెళ్తారు. మోదీ 16వ జీ-20 శిఖరాగ్ర సమావేశం కాప్-26 వరల్డ్ లీడర్స్ శిఖరాగ్ర సమవేశానికి హాజరవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇటలీ ప్రధాని మారియో ఆహ్వానం మేరకు.. ఈనెల 30, 31 వరకు రోమ్‌లో జరిగే 16వ జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. సమావేశంలో జీ-20 సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్, అంతర్జాతీయ సంస్థల ప్రభుత్వాధినేతలు కూడా పాల్గొంటారు.

ప్రైమ్ మినిష్ట‌ర్‌ మోడీ హాజరవుతున్న జీ-20 సదస్సు ఎనిమిదవది. జీ-20 కూటమికి ప్రస్తుతం ఇటలీ నాయకత్వం వహిస్తోంది. ఈనెల 30, 31 వరకు రోమ్‌లో రెండు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు ఆ దేశమే ఆతిథ్యం ఇస్తోంది.

ఆఫ్గనిస్తాన్ పరిణామాలు, వాతావరణ మార్పులు మానవాళికి విసురుతున్న సవాళ్లు, కరోనా వైరస్ వంటి కీలక అంశాలపై జీ-20 సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక 1999 నుంచి జీ-20 సదస్సుకు ఏటా నిర్వహిస్తున్నారు. కాప్-26 సదస్సు ఈనెల 31 నుంచి నవంబర్ 12 దాకా యూకేలోని గ్లాస్గోలో జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement