Thursday, May 2, 2024

Ind vs NZ: టీమిండియాకు మరో ఓటమి… సిరీస్ కైవ‌సం చేసుకున్న న్యూజిలాండ్

టీమిండియా మ‌హిళ‌ల జట్టు మరోసారి ఘోరంగా విఫలమైంది. న్యూజిలాండ్ తో జ‌రుగుత‌న్న ఐదు వ‌న్డేల సిరీస‌లో నేడు మూడో మ్యాచ్ లోనూ ఓట‌మి పాలైంది. మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్ ను న్యూజిలాండ్ మ‌హిళ జ‌ట్టు 3-0 తేడాతో వ‌న్డే సిరీస్ ను న్యూజిలాండ్ కైవ‌సం చేసుకుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 279 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. అనంత‌రం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.1 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్టపోయి ల‌క్ష్యాన్ని చేధించింది.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో మొద‌టి ఓవ‌ర్లో బౌల‌ర్ జూల‌న్ గో స్వామి ఆక‌ట్టుకుంది. మొద‌టి ఓవ‌ర్లోనే ఓపెన‌ర్ ను పేవిలియ‌న్ కు పంపించింది. త‌ర్వాతి ఓవ‌ర్లో మ‌రో కీల‌క బ్యాట‌ర్ ను అవుట్ చేసింది. దీంతో 2.3 ఓవ‌ర్లో 2 కీల‌క వికెట్ల‌ను న్యూజిలాండ్ కోల్పొయింది. త‌ర్వాత అమేలియా కెర్ (67), అమీ సాట‌ర్త్ వైట్ (59), లారెన్ డౌన్ (64) రాణించారు. దీంతో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది. లారెడ‌న్ డౌన్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement