Thursday, April 18, 2024

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ర్త్ డే – ’18పేజెస్’ పోస్ట‌ర్ రిలీజ్

18పేజెస్ చిత్రంలో హీరోయిన్ గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా నిఖిల్ న‌టిస్తున్నాడు. నేడు అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఆమెకి గ్రీటింగ్స్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. యూత్ ను ఆకట్టుకునేలా ఉంది ఈ పోస్టర్ ఉంది. ఇక ఆ తరువాత సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి ‘కార్తికేయ 2’ కూడా రెడీగానే ఉంది. ఇక అనుప‌మ‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి వరస విజయాలతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈమె నటించిన తొలి మూడు సినిమాలు విజయం సాధించాయి. ప్రేమమ్, అ..ఆ.., శతమానం భవతి లాంటి సూపర్ హిట్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం అదే జోరు చూపించడంలో విఫలమైంది. మధ్యలో రాక్షసుడు, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలు పర్లేదు అనిపించాయి కానీ అనుపమ కెరీర్‌ను మార్చేసే సినిమాలు మాత్రం కాలేక‌పోయాయి. ఇప్పుడు రానున్న చిత్రం ఆమెకి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement