Thursday, May 2, 2024

Covid-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుడం ఊరటనిస్తున్నాయి. సగటున రోజుకు 10 వేల కన్నా తక్కువగానే నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు నమోదైయ్యాయి. కరోనాతో మరో 132 మందిప్రాణాలు వదిలారు. నిన్న ఒక్క రోజే 8,077 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 82,267 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,41,87,017 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,77,554 మంది కరోనాతో మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.24 కాగా.. రికవరీ 98.39గా ఉంది. ఇక, మరణాలు 1.37 శాతంగా ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 137,67,20,359 మందికి కోవిడ్ టీకా అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement