Monday, April 29, 2024

India Corona: భారత్ లో 5 లక్షలు దాటిన కరోనా మృతులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 10 రోజుల క్రితం వరకు మూడు లక్షలకు చేరిన సంఖ్య … ఇప్పుడు లక్షకు దిగివచ్చాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,07,474 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138కు చేరింది. నిన్న ఒక్కరోజే 865 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 5,01,979కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,13,246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,04,61,148కు చేరింది. ప్రస్తుతం దేశంలో 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.90 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,69,46,26,697 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement