Wednesday, May 15, 2024

దేశంలో ఒక్కరోజే 3.49 లక్షల కరోనా కేసులు, 2,767 మరణాలు

దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు భారత్ లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒక్కరోజులో 3,49,691 పాజిటివ్ కేసులు నమోదు,2767 మంది మృతి చెందారు. ఏ స్థాయిలో ప్రాణనష్టం దేశంలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం అదుపు చేయలేకపోతున్నాయి.

ప్రస్తుతం దేశంలో 26 లక్షలు యాక్టివ్ కేసులు దాటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,69,60,172 కరోనా కేసులు నమోదు కాగా ,1,92,311 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 26,82,751 యక్టీవ్ కేసులు 1,40,85,110 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2.17 లక్షల మంది కరోనా రోగులు కోలుకున్నట్లు పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 83.49 శాతం,యక్టీవ్ కేసులు 15.37 శాతం, మరణాల రేటు 1.14 శాతంగా ఉంది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత పట్టి పీడిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. అవసరమైతే లాక్ డౌన్ విధించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్ర, దిల్లీలో మరణమృదంగం

మహారాష్ట్ర, ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 67,160 కేసులు నమోదు కాగా, 676 మంది మృతి చెందారు. దిల్లీలో ఒక్కరోజే 24,103 కేసులు నమోదు కాగా.. 357 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement