Tuesday, May 7, 2024

పెరిగిన ధ‌ర‌లు-పార్ల‌మెంట్ వ‌ద్ద టిఆర్ ఎస్ ఎంపీల ఆందోళ‌న‌

తెలంగాణ రాష్ట్ర ప‌మితి ఎంపీలు పార్ల‌మెంట్ లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు.నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అదుపులో లేవు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరగ‌డంతో నేప‌థ్యంలో సామాన్యుడి జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతోంది. ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం అవుతుంద‌న్నారు.. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్ర‌హం ముందు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి, మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కేశ‌వ‌రావు, నామానాగేశ్వ‌రరావు, సంతోష్‌, దివ‌కొండ దామోద‌ర్‌రావుల‌తో పాటు ఇత‌ర ఎంపీలు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. అయితే ధ‌ర‌ల పెరుగుద‌ల అంశంపై అంత‌కుముందు ఉభ‌య‌స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళ‌న చేపట్టారు. రెండు స‌భ‌లూ మ‌ద్యాహ్నం 2 వ‌ర‌కు వాయిదాప‌డ్డాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement